TSUTF | మధిర, జూన్ 22: ప్రతి సంవత్సరం బదిలీలు, పదోన్నతులు సకాలంలో నిర్వహిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు పరచాలని TSUTF ఖమ్మం జిల్లా కార్యదర్శి షేక్ నాగూర్ వలి అన్నారు. ఆదివారం టీఎస్ యూటీఎఫ్ మధిర మండల అధ్యక్షుడు బండారు నాగరాజు అధ్యక్షతన ప్రాంతీయ కార్యాలయంలో సమావేశం జరిగింది.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. వేసవి సెలవుల కాలంలో సామాజిక స్పృహతో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతానికి కృషి చేశామన్నారు. ఈ కుబేర్ పెండింగ్ బిల్లులను తక్షణమే జమ చేయాలని కోరారు. విద్యా యాత్ర జీపు జాతా పేరుతో బడిబాట నిర్వహించటం జరిగిందన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఈ సంవత్సరం లక్ష మంది విద్యార్థులు అదనంగా చేరటం సంతోషదాయకమన్నారు. ప్రభుత్వం విద్యారంగం బలోపేతం దిశగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేయ సంకల్పించడం ఆనందకరం అన్నారు. సంఘ రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే ఈ విషయమై ఇచ్చిన ప్రాతినిధ్యాలను పరిగణలోకి తీసుకోవాలని కోరారు.
ఈ సమావేశంలో కన్వీనర్ ఏ వినోద రావు, మండల ప్రధాన కార్యదర్శి ఈ వీరయ్య మండల ఉపాధ్యక్షులు షేక్ ఇబ్రహీం, కాజా సునీత, కోశాధికారి బైర్ల చెన్నయ్య, మండల కార్యదర్శులు యం.డి రఫి, GBMS రాణి, డి కవిత, మల్లా రాజు, షేక్ లాల్ అహ్మద్, వి కొండలరావు, కె ఆదాము, ఎల్.నాగేశ్వరరావు, పి రాంబాబు, ఎన్ గోపీచంద్, చేడే రాణి, జి భూలక్ష్మి, ఎస్ కృష్ణ ఆంజనేయులు తదితరులున్నారు.
Peddagattu | జీఓ ఇచ్చారు.. నిధులు మరిచారు.. కాంగ్రెస్ హయాంలో లింగమంతుల స్వామికి శఠగోపమేనా?
Bigg Boss 9 | బిగ్ బాస్ సందడికి టైం ఫిక్స్ అయినట్టేనా.. కంటెస్టెంట్స్ ఎవరెవరంటే..!
Road Accident | వేగంగా వెళ్లి చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి..