Thirumalayapalem | పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యంతో ఉపాధి కోల్పోయిన గీత కార్మికులు
పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యంతో గీత కార్మికులు ఉపాధి కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంది.
Thirumalayapalem | పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యంతో గీత కార్మికులు ఉపాధి కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళ్తే..ఖమ్మం జిల్లా తిరుమలయపాలెం మండలంలోని దమ్మైగూడెంలో గ్రామపంచాయతీ కార్యదర్శి రమేష్ నిర్లక్ష్యం వలన గీత కార్మికులకు జీవనాధారమైన ఈత చెట్లు కాలిపోయాయి. వివరాల్లోకెళ్తే దమ్మాయిగూడెం ఊర చెరువు పక్క కాలువలో ఉపాధి హామీ పనులు చేపట్టేందుకు కంపకట్టలను కూలీలతో తొలగించకుండా పంచాయతీ కార్యదర్శి నిప్పు పెట్టించాడు.
దీంతో చెత్తాచెదారానికి అంటించిన అగ్ని వ్యాప్తి చెంది చెరువుగట్టు పై ఉన్న ఈత చెట్లన్నీ కాలిపోయాయి. దీంతో గీత కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఉపాధి హామీ పనుల పేరుతో మంట పెట్టి మా జీవనాధారాన్ని మంటలో కలిపేశారని గీత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం చెట్లు తగలబడుతున్న వాటిని రక్షించేందుకు ప్రయత్నం కూడా చేయలేదని గీత కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈత చెట్లు కాలిపోయేందుకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను గీత కార్మికులు డిమాండ్ చేశారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
Non Veg | నాన్వెజ్ తినే మహిళలు వందేళ్లు బతుకుతారంట.. సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

