ఖమ్మం వ్యవసాయం, మే 29 : జిల్లాలో పచ్చిరొట్ట విత్తనాలకు ఎలాంటి కొరత లేదని, కావాల్సినన్ని అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ వీపీ గౌతమ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 21,276 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు అవసరం ఉండగా 14,067 క్వింటాళ్ల విత్తనాలు వచ్చాయన్నారు. ఇప్పటివరకు 8,908 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు అమ్మకం జరగగా, ఇంకా 5,159 క్వింటాళ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. మిగతా విత్తనాలు త్వరలో వస్తాయన్నారు. రైతులు ఎలాంటి ఆందోళన పడవద్దన్నారు. కావాల్సిన దానికంటే అదనంగా విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు.