ఖమ్మం రూరల్, జనవరి 27 : ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 32 వార్డులకు సంబంధించి ఇప్పటికే మున్సిపల్ అధికారులు 69 పోలింగ్ బూత్‌లను గుర్తించడం జరిగింది. మొత్తం మున్సిపాలిటీ పరిధిలో 32 వార్డుల్లో 45,256 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. అయితే ఈ దఫా నామినేషన్ల స్వీకరణకు 13 కేంద్రాలను గుర్తించారు. ఒకటి, రెండో డివిజన్ కు సంబంధించి హార్వెస్ట్ స్ప్రింగ్ లీఫ్ పాఠశాలలో నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. మూడు, నాలుగు, ఐదు వార్డులకు గాను ఎంపీడీఓ కార్యాలయంలోని సమావేశ మందిరాన్ని నామినేషన్ల స్వీకరణకు గుర్తించడం జరిగింది. 6వ, 7వ, 22వ వార్డులకు ఎంపీడీఓ ఆఫీస్ కార్యాలయంలోని ఎంపీపీ గదిలో నామినేషన్లను స్వీకరించనున్నారు. 8వ, 9వ, 13వ వార్డులకు సంబంధించి వెంకటగిరి పాత పంచాయతీ కార్యాలయం,
అలాగే 10వ, 11వ, 12వ వార్డులకు గుదిమళ్ల పంచాయతీ కార్యాలయం, 14వ, 15వ వార్డులకు తెల్దార్‌పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం, 16వ, 17వ వార్డులకు సంబంధించి మద్దులపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం, 18వ, 19వ వార్డులకు సంబంధించి బారుగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం, 20వ, 21వ వార్డులకు ముత్తగూడెం గ్రామ పంచాయతీ ఆఫీస్, 23వ, 24వ, 28వ వార్డులకు గాను ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలోని శ్రీ శక్తి సమావేశం మందిరం, 25వ, 26వ, 27వ వార్డులకు గాను ఎంపీడీఓ కార్యాలయం పరిధిలోని ఎమ్మార్సీ బిల్డింగ్, 29వ, 30వ వార్డులకు ఎంపీడీఓ కార్యాలయం పరిధిలోని శ్రీ శక్తి భవన్ ఏపీఎం రూల్, 31వ, 32వ డివిజన్లకు సంబంధించి ఎంపీడీఓ కార్యాలయంలోని ఈజీఎస్ ఆఫీస్ లో నామినేషన్లను సంబంధిత అధికారులు స్వీకరించనున్నారు. రేపటి నుండి ఈ నెల 30 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు.