మార్కెట్లో క్రయవిక్రయాలు షురూ..
ఐదు రోజుల వరుస సెలవుల అనంతరం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో బుధవారం క్రయవిక్రయాలు ప్రారంభమయ్యాయి. మిర్చి యార్డుకు రైతులు భారీగా సరుకు తీసుకొచ్చే అవకాశం ఉన్నదని అధికారులు, వ్యాపారులు భావించినా ఆశించిన మేర విక్రయానికి రాలేదు.
- మిర్చి క్వింటా ధర రూ.21,300
ఖమ్మం వ్యవసాయం, జనవరి 17 : ఐదు రోజుల వరుస సెలవుల అనంతరం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో బుధవారం క్రయవిక్రయాలు ప్రారంభమయ్యాయి. మిర్చి యార్డుకు రైతులు భారీగా సరుకు తీసుకొచ్చే అవకాశం ఉన్నదని అధికారులు, వ్యాపారులు భావించినా ఆశించిన మేర విక్రయానికి రాలేదు. సెలవులకు ముందు మిర్చి ధర పడిపోవడం తదితర కారణాల వల్ల యార్డుకు 20 వేల బస్తాలు మాత్రమే విక్రయానికి వచ్చినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. ఉదయం జెండా పాట సమయానికి వివిధ జిల్లాల నుంచి 18,803 బస్తాల మిర్చి, 4,491 బస్తాల పత్తి, 14 బస్తాల పెసర, తాలు మిర్చి మరో 2,752 బస్తాలను రైతులు మార్కెట్‌కు తరలించారు.
మిర్చి జెండా పాటలో గరిష్ట ధర క్వింటా రూ.21,300 పలుకగా.. మధ్య ధర క్వింటా రూ.18వేలు కాగా.. కనిష్ట ధర రూ.6,300 పలికింది. పత్తి పంట ఆన్లైన్ బిడ్డింగ్‌లో గరిష్ట ధర క్వింటా రూ.6,700 కాగా.. మధ్య ధర రూ.6,300, కనిష్ట ధర రూ.5,500 పలికింది. తాలు రకం మిర్చి గరిష్ట ధర రూ.12వేలు పలికింది. పెసర పంట గరిష్ట ధర క్వింటా రూ.5,600 చొప్పున ధర నిర్ణయించి ఖరీదుదారులు కొనుగోలు చేశారు. క్రయవిక్రయాలను మార్కెట్ కమిటీ గ్రేడ్-టూ అధికారి బజార్, అసిస్టెంట్ సెక్రటరీ వజీరుద్దీన్ పర్యవేక్షించారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

