మామిళ్లగూడెం, ఫిబ్రవరి 16 : ఖమ్మం టౌన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్(ఏసీపీ)గా ఎస్వీ రమణమూర్తి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన సీపీ సునీల్ దత్‌ను పోలీస్ కమిషనరేట్‌లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. కాగా.. రమణమూర్తి ఇల్లెందు డీఎస్పీగా పనిచేసి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం టౌన్‌కు బదిలీపై వచ్చారు.