రఘునాథపాలెం, జనవరి 7 : ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అభ్యంతరం లేని భూముల క్రమబద్దీకరణకు జారీ చేసిన జీవో నెం 59క్రింద నిబంధనలకు విరుద్దంగా, ఎలాంటి నిర్మాణాలు లేకున్నా ధరఖాస్తు చేసి అక్రమంగా క్రమబద్దీకరణ కోసం ప్రయత్నం చేసిన స్థలాలను గుర్తించి రక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఖమ్మం అర్బన్ పరిధిలోని ఖానాపురం సర్వే నెం.272లో 300గజాల ప్లాట్, ఖానాపురం డొంకలో 200గజాల రెండు ప్లాట్లు, 150గజాల మరో ప్లాట్, వెలుగుమట్ల సర్వే నెంబర్ 412లో 300గజాల ప్టాట్లు ఎలాంటి నిర్మాణాలు లేకుండా క్రమబద్దీకరణకు జీవో 59క్రింద దరఖాస్తులు చేశారన్నారు.
వాటిని తిరస్కరించడం జరిగిందన్నారు. సుమారు రూ.4.35కోట్ల విలువైన స్థలాలను రెవిన్యూ, మునిసిపల్ అధికారులు స్వాదీనం చేసుకొని ఫెన్షింగ్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా అభవిశ్యత్తులో ఆక్రమణలు జరగకుండా ససీ కెమేరాల ఏర్పాటుకు అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. రెవిన్యూ, మున్సిపల్ సిబ్బంది నిఘా పెట్టి ఎలాంటి ఆక్రమణలు జరగకుండా, నిర్మాణాలు చేపట్టకుండా పకడ్భంధీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.