ఖమ్మం ఎడ్యుకేషన్/ కొత్తగూడెం ఎడ్యుకేషన్, డిసెంబర్ 17: సమగ్రశిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) ఉద్యోగులను బేషరతుగా రెగ్యులరైజ్ చేయాలని టీఎస్సీపీఎస్ఈయూ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు చంద్రకంటి శశిధర్ డిమాండ్ చేశారు.
రెగ్యులరైజేషన్, మినిమం పే స్కేల్ డిమాండ్లపై చేస్తున్న సమ్మెలో భాగంగా ఖమ్మం కలెక్టరేట్ ధర్నాచౌక్ వద్ద ఎస్ఎస్ఏ ఉద్యోగులు కొనసాగిస్తున్న నిరసన మంగళవారం ఎనిమిదో రోజుకు చేరింది. ఈ సందర్భంగా శశిధర్ మద్దతు తెలిపి మాట్లాడారు. కాగా, సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు మోహన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఎస్ఎస్ఏ ఉద్యోగుల దీక్ష మంగళవారం 8వ రోజుకు చేరుకుంది. భద్రాద్రి కలెక్టరేట్ ఎదుట మోకాళ్ల నిలబడి, చెవిలో పూలు పెట్టుకొని ఎస్ఎస్ఏ ఉద్యోగులు నిరసన తెలిపారు.