Sri Mruthyunjaya Swamy | మధిర, ఫిబ్రవరి 25 : మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని మధిర పట్టణంలోని వైరా మున్నేరు సమీపంలో గల శ్రీ మృత్యుంజయ స్వామి వారి కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లు చేపట్టారు. ఈ సందర్భంగా ఇవాళ ఉదయం 7:35 నిమిషాలకు దేవాలయ ప్రాంగణం నందు మేళ తాళాలతో మామిడి తోరణాలు కట్టే కార్యక్రమం చేశారు. ఉదయం 9:45 నిమిషాలకు శ్రీ స్వామివారిని పెళ్లి కుమారునిగా, పార్వతీదేవి అమ్మవారిని పెండ్లి కూతురిగా అలంకరించారు.
కల్యాణ మహోత్సవం సందర్భంగా భక్తులకు పార్వతీ పరమేశ్వరులు దర్శనమిచ్చారు. దేవాలయ అర్చకులు స్వామివారి కల్యాణ కార్యక్రమం సందర్భంగా సాయంత్రం అంకురారోపణ, ధ్వజారోహణ, అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాలు జరగనున్నాయి. బుధవారం రాత్రి 12 గంటలకు శ్రీ మృత్యుంజయ స్వామి వారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగేలా దేవాలయ నిర్వాహకులు ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు.
Srisailam | శ్రీశైలంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన డీఐజీ ప్రవీణ్
బస్సులున్నయ్.. డ్రైవర్లే లేరు !.. డిప్యూటీ సీఎం ఇలాకాలో ఆర్టీసీ డ్రైవర్ల కొరత!