మధిర, ఏప్రిల్ 25 : ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ మహాసభకు దండులా కదలాలి వచ్చి విజయవంతం చేయాలని ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు. శుక్రవారం నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో పట్టణ పరిధి లోని ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..పార్టీ అధినేత ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు.
రూట్ మ్యాప్ ఇచ్చిన ఆధారంగా వాహనాలను రెండో జోన్‌లోని పార్కింగ్‌కు తరలించాలన్నారు. కార్యకర్తలకు ముందస్తుగా సమాచారం ఇచ్చి బస్సుల్లో ఎక్కే విధంగా నాయకులు చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తారు నాగేశ్వర్రావు, బొగ్గుల భాస్కర్ రెడ్డి, చావా వేణుబాబు, వంకాయలపాటి నాగేశ్వర్రావు, యన్నంశెట్టి అప్పారావు, ఆళ్ల నాగబాబు, సయ్యద్ ఇక్బాల్, కొత్తపల్లి నరసింహారావు, ఉమామహేశ్వర్ రెడ్డి, కోటిరెడ్డి, రాంబాబు పాల్గొన్నారు.