కారేపల్లి, జనవరి 21 : ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గాదెపాడు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దాచేపల్లి కృష్ణారెడ్డి(60) బుధవారం మధ్యాహ్నం గుండెపోటుతో కన్నుమూశారు. ఉదయం నుండి చాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఇల్లెందు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కృష్ణారెడ్డికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. గ్రామ పెద్దగా వ్యవహరించే కృష్ణారెడ్డి అకాల మరణంతో గాదేపాడు పరిసర గ్రామాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు (డివి)లతో పాటు పలువురు కృష్ణారెడ్డి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.