Sevalal Maharaj | కారేపల్లి, ఫిబ్రవరి 15: బంజారా గిరిజనుల ఆరాధ్య దైవం సంతోష్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను శనివారం మండల వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. స్థానిక బంజారా గిరిజన నాయకులు సంతు సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంజారా గిరిజనుల అభ్యున్నతికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బంజారా నాయకులు మాళోత్ హేమ్లా నాయక్, బీ సుబ్బారావు, హీరాలాల్, బానోత్ బాలు నాయక్, కేలోత్ రాములు నాయక్, జరపల కిషోర్ తదితరులు పాల్గొన్నారు.