MLA Ramdas Nayak | ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో ఇవాళ సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవాలకు స్థానిక వైరా ఎమ్మెల్యే మాలోతు రామదాసు నాయక్ ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు. సాంప్రదాయ దుస్తుల్లో ఉన్న బంజారా మహిళలు ముందుగా మండల కేంద్రానికి చేరుకున్న ఎమ్మెల్యే నుదుటిన తిలకం దిద్ది ఘన స్వాగతం పలికారు.
అనంతరం యువతీ, యువకులు, మహిళలతో కలిసి ఎమ్మెల్యే బంజారా సాంప్రదాయ నృత్యం చేస్తూ ర్యాలీగా ఉత్సవ ప్రాంగణం వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సంత్ సేవాలాల్ మహారాజ్ కేవలం గిరిజనుల ఆరాధ్య దైవం మాత్రమే కాదని, అందరికీ ఆరాధ్యుడేనన్నారు. గిరిజనులకు దశ-దిశను చూపి, హైందవ ధర్మం గొప్పతనం, విశిష్టతలను తెలియజేయడానికే సేవాలాల్ మహారాజ్ జన్మించినట్లు చరిత్రకారులు చెబుతారని పేర్కొన్నారు.
బంజారా జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటేలా అహింసా సిద్ధాంతానికి పునాదులు వేశారని.. తద్వారా శ్రీసంత్ సేవాలాల్ ఇతర కులాల వారికి కూడా ఆదర్శ మూర్తిగా నిలిచారని పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరూ మన సంస్కృతి, సాంప్రదాయాలు కాపాడుకోవాలని సూచించారు. గిరిజనుల అభివృద్ధి, సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవించాలన్నారు. ఈ కార్యక్రమంలో బంజారా గిరిజన సంఘం నాయకులు, నిర్వాహక కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Robbery | బైనపల్లి ఆలయంలో చోరీ.. హుండీ ధ్వంసం చేసి నగదు, ఆభరణాలు అపహరణ
మాధవస్వామి గట్టుపై ఇంటిగ్రేటెడ్ ప్రభుత్వ పాఠశాల.. గురుకుల పాఠశాలల రాష్ట్ర సెక్రటరీ స్థల పరిశీలన
Warangal | కేంద్రం బడ్జెట్ను వ్యతిరేకిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా