ఇల్లెందు, జూలై 19 : తెలంగాణలో రైతులకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, గొప్పగా ప్రాజెక్టులు కట్టిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను రేవంత్రెడ్డి తిడుతున్న తీరును చూసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఛీ కొడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి ఖమ్మం జిల్లా సర్ కార్యక్రమం, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు అన్నారు. ఆదివారం ఇల్లెందు పట్టణంలో మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియనాయక్ ఆధ్వర్యంలో సర్ కార్యక్రమంపై అవగాహనలో భాగంగా బీఆర్ఎస్ కార్యాలయం నుంచి బైక్ ర్యాలీ జగదాంబ సెంటర్, ఆమ్బజార్, బుగ్గవాగు, కొత్త బస్టాండ్ మీదుగా గోవింద్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం హరిప్రియనాయక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తక్కెళ్లపల్లి రవీందర్రావు మాట్లాడుతూ రాష్ట్రంలో రెండు సంవత్సరాల రేవంత్రెడ్డి పాలనను ప్రజలు అసహ్యించుకుంటున్నారని, ఏ ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో నెరవేర్చకపోవడం, కేసీఆర్ను నిర్మించిన ప్రాజెక్టుల నుంచి నీరు వదలకపోవడంపై రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసి సాధించి పది సంవత్సరాలు అభివృద్ధి చేసిన కేసీఆర్ ప్రజల గుండెల్లో సుస్థిరంగా ఉన్నారన్నారు. కేసీఆర్ పాలనలో రైతులకు విద్యుత్, ఎరువుల సమస్య లేదని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు గోసపడుతున్నారని అన్నారు.
గ్రామాల్లో తిరిగేందుకు కాంగ్రెస్ నాయకులు భయపడుతున్నారన్నారు. హరిప్రియనాయక్ మాట్లాడుతూ బీఆర్ఎస్ బీఎల్ఏలు పట్టణంలో ప్రతి బూత్ స్థాయిలో ప్రతి ఇంటికి వెళ్లి సర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం ఇల్లెందు మండలం కొమరారంలో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బానోత్ హరిసింగ్నాయక్, మాజీ కౌన్సిలర్లు కటకం పద్మావతి, సిలివేరి సత్యనారాయణ, నాయకులు భూక్య దళ్సింగ్నాయక్, దేవిలాల్నాయక్, మహేందర్, హరిప్రసాద్, రాజేష్, రవికాంత్, హరిక్రిష్ణ, వెంకటేశ్వర్లు, నెమలి ధనలక్ష్మి, నారాయణమ్మ, బీఆర్ఎస్ బీఎల్ఏలు, కార్యకర్తలు పాల్గొన్నారు.