మణుగూరు టౌన్, మార్చి 14: కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం లేకనే ప్రశ్నించిన గొంతుకను అడ్డుకునేందుకు ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేసి దుశ్చర్యలకు పాల్పడుతున్నదని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. గురువారం అసెంబ్లీలో జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ రేగా కాంతారావు ఆధ్వర్యంలో శుక్రవారం మణుగూరు పట్టణంలో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా నిర్వహించారు.
పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి మాటలను వక్రీకరిస్తూ.. బడ్జెట్ సమావేశాల్లో సమాధానం చెప్పలేక ఏదో కొర్రీలు పెట్టడానికి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతుందన్నారు.
కాంగ్రెస్‌పై వ్యతిరేకతతో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని, సీఎం కేసీఆర్ కావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో నాయకులు కుర్రి నాగేశ్వరరావు, కుంట లక్ష్మణ్, యాదగిరి గౌడ్, ముద్దంగుల కృష్ణ, ఆవుల నరసింహారావు, ఎడ్ల శ్రీనివాస్, అక్కి నరసింహారావు, దర్శనాల శ్రీనివాస్, కాటిబోయిన సుజాత, ఏనిక ప్రసాద్, వల్లభనేని రమణ, వడ్లూరి రాంబాబు, బర్ల సురేశ్, తురక రాంకోటి, ఉప్పుతల రామారావు, రమేశ్, రుద్రం, వెంకట్, కోటి, లక్ష్మణ్, రవి, జావీద్, సృజన్, జ్యోతి, మాధవి, మణెమ్మ పాల్గొన్నారు.