Ramzan Tohfa | కారేపల్లి, మార్చి 23: ముస్లిం నిరుపేదలకు రంజాన్ పండగకు కావాల్సిన నిత్యావసర వస్తువుల సామాగ్రిని బీఆర్ఎస్ మైనార్టీ సెల్ జిల్లా నాయకుడు షేక్ గౌసుద్దీన్ ఇవాళ పంపిణీ చేశారు. కారేపల్లి మండల కేంద్రంలో గల గౌస్ నివాసంలో 152 పేద ముస్లిం కుటుంబాలకు విశ్రాంత ఉపాధ్యాయుడు, ముస్లిం కుల పెద్ద మహమ్మద్ బాబు సాహెబ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా బాబు సాహెబ్ మాట్లాడుతూ.. మహ్మద్ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్ ఆవిర్భవించిన ఈ రంజాన్ మాసంలో నెల రోజులపాటు ఎంతో నియమనిష్ఠలతో ముస్లిం సోదరులు కఠిన ఉపవాస దీక్ష ఆచరించి అల్లాహ్ కృపకు పాత్రులవుతారన్నారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం ఇచ్చే గొప్ప సందేశమని ఆయన అన్నారు.
ముస్లింలు అతిపవిత్రంగా భావించే రంజాన్ మాసంలో వారు అనేక దైవకార్యాలు చేస్తారని, ప్రతిరోజూ ఐదు సార్లు ప్రత్యేక ప్రార్థనలు జరుపుతారని, ఈ నెలలోనే అల్లా దైవదూత ద్వారా ఖురాన్‌ను ఆకాశం నుంచి నేల మీదకు పంపించారని ముస్లింల నమ్మకమని వివరించారు.
మనిషిలోని చెడు భావాల్ని, అధర్మాన్ని,ద్వేషాన్ని రూపు మాపుతూ మానవాళికి హితాన్ని బోధించే పండుగ రంజాన్ అని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఈ మాజీ వార్డు సభ్యులు చాంద్ మియా, ఉద్యమకారుడు సోమందుల నాగరాజు,ఖలిలుల్లా ఖాన్,సద్దాం,ఫిరోజ్,ముస్తఫా,మోసిన్, హజార్,అబ్దుల్ వాహెబ్,షేక్ ఆసిఫ్,టోహిన్ తదితరులు పాల్గొన్నారు.
Hyderabad | ఎస్టీ హాస్టల్లో పురుగుల అన్నం.. రోడ్డెక్కిన విద్యార్థులు