మధిర, మార్చి 27 : ముస్లిం ఐక్య సంఘం ఆధ్వర్యంలో పేద ముస్లింలకు రాయపట్నం రోడ్డు నందు గల షాదీఖానాలో రంజాన్ తోఫా పంపిణీ చేశారు. మధిర పట్టణంలో400 మందికి, మధిర మండలంలో 400 మంది పేద ముస్లింలకు మధిర తాసీల్దార్ కె. రాంబాబు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ముస్లిం ఐక్య సంఘం సెంట్రల్ కమిటీ అధ్యక్షుడు మౌలానా షేక్ ముజాహిద్ మాట్లాడుతూ.. ముస్లిం ఐక్య సంఘం తరఫున మధిర నియోజకవర్గస్థాయిలో వివిధ సేవా కార్యక్రమాలను చేస్తున్నట్లు తెలిపారు.
ముస్లింలు విద్య, ఆర్థిక, సామాజికంగా అభివృద్ధి చెందాలన్నారు. ఈ సమావేశంలో ముస్లిం ఐక్య సంఘం సెంటర్ కమిటీ ఉపాధ్యక్షుడు జనాబ్ షేక్ హుస్సేన్, ప్రధాన కార్యదర్శి జనాబ్, షేక్ మొహమ్మద్ గౌసుద్దీన్, కోశాధికారి జనాబ్, షేక్ నాగుల్ మీరా, కార్యదర్శులు జనాబ్ సయ్యద్ కరీం, మధిర మండల కమిటీ అధ్యక్షుడు జనాబ్ షేక్ గాలిబ్, సహాధ్యక్షులు మొహమ్మద్ జమీర్, జనాబ్ నజీమ్, సైదులు, హైదర్ జాకీర్, హుస్సేన్, షేక్ మహబూబ్, సుభానీ పాల్గొన్నారు.