మధిర రూరల్ : భారత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ 77వ జయంతి వేడుకలను మధిరలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్‌గాంధీ చిత్రపటానికి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సూరంశెట్టి కిషోర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాజీవ్‌గాంధీ దేశానికి చేసిన సేవలను గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు మిరియాల వెంకటరమణ గుప్త, దారా బాలరాజు, కోన ధనికుమార్, మునుగోటి వెంకటేశ్వర్లు, షేక్ మొహమ్మద్ అలీ, షేక్ జహంగీర్, ఎస్.కే.బాజీ, కర్నాటి రామారావు, బండారు నరసింహారావు, జింకల కోటేశ్వరరావు, ఆదిమూలం శ్రీనివాసరావు, కోట డేవిడ్, షేక్ జమీల్‌పాషా, మైలవరపు చక్ర, తదితరులు పాల్గొన్నారు.