ఖమ్మం, మార్చి 8 : మహిళలు అన్నిరంగాల్లో ముందుండాలని, అప్పుడే దేశం అభివృద్ధిపథంలో పయనిస్తుందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. శనివారం ఖమ్మం నగరంలోని మమత క్యాంపస్‌లో గల క్యాంప్ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పువ్వాడ కేక్ కట్ చేసి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు మహాలక్ష్మి, సూటీలు, కల్యాణలక్ష్మి, ఉద్యోగం లేనివారికి మూడు వేలు ఇస్తామని చెప్పి మోసం చేసిందన్నారు.
స్థానిక సంస్థల్లో 50శాతం సీట్లు మహిళలకు కేటాయించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. మహిళా సాధికారత కోసం బీఆర్ఎస్ పార్టీ ఎంతో కృషి చేసిందన్నారు. సీడబ్ల్యూసీ చైర్మన్ భారతీరాణిని సన్మానించారు. కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, మహిళా అధ్యక్షురాలు కొల్లు పద్మ, సుడా మాజీ చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, ప్రచార కార్యదర్శి షకీనా, సుజాతరెడ్డి, అడ్వకేట్ ఉబ్బలపల్లి నిరోషా, ఊర్మిళ, ఝౌన్సీ, మాధవి, శైలజ పాల్గొన్నారు.