రఘునాధపాలెం, మార్చి 16: రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనదని, ముస్లింలు ఎంతో నిష్టతో నెలంతా దీక్షలు చేస్తారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఖమ్మం ఖిల్లా మసీద్‌లో ఆదివారం జరిగిన ఇఫ్తార్ విందులో పువ్వాడ పాల్గొని ముస్లింలతో కలిసి నమాజు చేశారు. ముస్లింలు భక్తిశ్రద్ధలతో రంజాన్ పండుగను జరుపుకోవాలని సూచించారు.
సమాజంలో అందరూ కలిసిమెలిసి జీవించినప్పుడే మత సామరస్యం వెల్లివిరుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ ఖమర్, కార్పొరేటర్ మక్బుల్, షౌకత్‌అలీ, నాగండ్ల కోటేశ్వరరావు, బిక్కసాని జస్వంత్, నజీముద్దీన్, జిల్లా మైనార్టీ అధ్యక్షుడు తాజద్దీన్, సుడా మాజీ చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, త్వోసిఫ్ ముజాహిద్, తోసిఫ్, అసద్, హరికృష్ణ, రాధాకృష్ణ, ఆసిఫ్, మున్నా, చంటి పాల్గొన్నారు.