కారేపల్లి, ఏప్రిల్ 10 : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెంచేందుకు స్థానిక ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని కారేపల్లి ఎంఈఓ జయరాజు పిలుపునిచ్చారు. మండల పరిధిలోని బొక్కలతండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం 5వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఎంఈఓ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో అర్హత కలిగిన ఉపాధ్యాయులచే నాణ్యమైన విద్యా బోధన ఉంటుందన్నారు. అదేవిధంగా విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు. రాబోయే విద్యా సంవత్సరం నుండి 21 రకాల వస్తువులతో కూడిన కిట్ ను విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తుందన్నారు.
అదేవిధంగా అల్పాహారం కూడా ఇవ్వనున్నట్లు చెప్పారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన ఆటపాటలు సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను అలరించాయి. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వాంకుడోత్ హనుమంతరావు, కోమట్ల గూడెం స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు శారద, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మంగిలాల్ ఉపాధ్యాయులు రజిని కుమారి శుకృ,ఎమ్మార్సీ సిబ్బంది మోతిలాల్, విజయ్, కుమార్,పరమేష్,రాములు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.