తగ్గిన తేజస్సు
మార్కెట్లో మిర్చి ధరలు రోజురోజుకూ తగ్గుతుండడంతో ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒక్క రోజులోనే తేజా రకం మిర్చి ధర క్వింటాకు రూ.500 తగ్గడంతో అయోమయానికి గురవుతున్నారు.
- ఒక్కరోజులోనే క్వింటాకు రూ.500 తగ్గిన ధర
- ఆందోళన చెందుతున్న మిర్చి రైతులు
ఖమ్మం వ్యవసాయం, జనవరి 9 : మార్కెట్లో మిర్చి ధరలు రోజురోజుకూ తగ్గుతుండడంతో ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒక్క రోజులోనే తేజా రకం మిర్చి ధర క్వింటాకు రూ.500 తగ్గడంతో అయోమయానికి గురవుతున్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లోని మిర్చి యార్డులో మంగళవారం ఉదయం జరిగిన జెండా పాటలో తేజా రకం మిర్చి క్వింటా ధర రూ.20,500 పలికింది. సోమవారం ఇదే మార్కెట్లో క్వింటా ధర రూ.21 వేలు పలికింది. సీజన్ ఆరంభంలో క్వింటా ఒక్కంటికి దాదాపుగా రూ.24 వేల వరకు ధర పలకగా..
వారం రోజుల వ్యవధిలోనే రూ.20 వేలకు చేరడంతో మిర్చి సాగు రైతులు నిరుత్సాహానికి లోనయ్యారు. కాగా.. ఉదయం జెండా పాట సమయానికి వివిధ జిల్లాల నుంచి రైతులు దాదాపు 20 వేల మిర్చి బస్తాలను విక్రయానికి తీసుకొచ్చారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా పంట దిగుబడి బాగా తగ్గడంతో ఆశించిన మేర ప్రయోజనం లేకపోయింది. సంక్రాంతి పండుగ తర్వాత ధరల్లో కొంత వ్యత్యాసం వచ్చే అవకాశం ఉన్నదని కొందరు వ్యాపారులు పేర్కొంటున్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

