దుమ్ముగూడెం, జనవరి 2 : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన గ్రామసభలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. మంగళవారం దుమ్ముగూడెంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన గ్రామసభను ఆర్డీవో మంగీలాల్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు అధికారులకు సమర్పించిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి..
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోయే ఆరు గ్యారెంటీలను ప్రతి పేదవానికి అందించేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ఎంఈవో సున్నం సమ్మయ్య, మండల అధ్యక్షుడు అన్నె సత్యనారాయణమూర్తి, మండల కార్యదర్శి కణితి రాముడు, సీనియర్ నాయకులు కొత్తూరు సీతారామారావు, కెల్లా శేఖర్ పాల్గొన్నారు.