భద్రాద్రి జిల్లా చండ్రుగొండ మండలం దామరచర్ల గ్రామానికి చెందిన ఈ రైతు పేరు జిగురు రాఘవులు. ఇతడికున్న నాలుగు ఎకరాల మాగాణిలో రెండు నెలల క్రితం యాసంగి సీజన్ వరిని సాగు చేస్తున్నాడు. నెల రోజుల నుంచి కరెంటు కోతలు పెరిగాయి.
ఈ క్రమంలో భూగర్భ జలాలు కూడా తగ్గాయి. దీంతో బోరుబావి నీరు రెండు ఎకరాలకే సరిపోతున్నది. దీంతో మిగతా పొలమంతా తన కళ్లెదుటే ఎండిపోతోందంటూ బోరుమంటున్నాడు. ఇప్పటి వరకు అప్పు చేసి మరీ రూ.1.20 లక్షల వరకు పెట్టుబడి పెట్టానంటూ తన పొలంలోనే ఉండి పైరును చూస్తూ తల పట్టుకుంటున్నాడు.
-చండ్రుగొండ, మార్చి 6