కొణిజర్ల, సెప్టెంబర్ 12: కొణిజర్ల పీఏసీఎస్ వద్ద యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా టీ న్యూస్ ప్రతినిధి సాంబశివరావుపై పోలీసులు అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గమని మాజీ మంత్రి టి.హరీశ్‌రావు ట్వీట్ చేశారు. రైతుల సమస్యలను తెలుసుకునేందుకు వెళ్లిన జర్నలిస్టుపై పోలీసులు ఉల్టా కేసులు పెట్టడం రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు.
రాష్ట్రంలో రెండు నెలలుగా రైతులు యూరియా కోసం నానా కష్టాలు పడుతుంటే పట్టించుకోని ప్రభుత్వం.. తన నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతున్న మీడియా ప్రతినిధులపై కేసులు పెట్టడం శోచనీయమన్నారు. శాంతిభద్రతల నిర్వహణను పక్కనపెట్టి.. ప్రజల గొంతు నొక్కేందుకు పోలీసులను పురిగొల్పడం అప్రజాస్వామికమని, జర్నలిస్టు సాంబశివరావుపై పెట్టిన కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, డీజీపీని ఆయన డిమాండ్ చేశారు.