Fish Ponds | కారేపల్లి (కామేపల్లి) సెప్టెంబర్ 27: ఖమ్మం జిల్లా కామేపల్లి మండల పరిధిలోని పింజర మడుగు చిన్న చెరువులో చేపలపై దుండగులు విషప్రయోగం చేశారు. విష ప్రయోగంతో చెరువులోని చేపలన్నీ మృత్యువాతకు గురవుతున్నాయి. ఈ చెరువులో చేపలను పోషిస్తూ సుమారు 50 కుటుంబాలు ఆధారపడుతున్నామని చేపల సొసైటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
వర్షాలు ఏకధాటిగా పడుతుండడంతో రాత్రి వేళల్లో చెరువు వద్ద కాపలా ఉండటం కష్టతరంగా మారిందన్నారు. దీంతో కావాలని కొంతమంది చెరువులు విషం కలుపుతున్నారని ఆరోపించారు. లక్షల రూపాయల వ్యయం వెచ్చించి చేప పిల్లలను కొనుగోలు చేసి పోషిస్తున్నామని.. విషం కలపడం వల్ల భారీగా నష్టపోవలసిన పరిస్థితి నెలకొందని సొసైటీ సభ్యులు వాపోయారు.
విష ప్రయోగం చేసిన వారిని గుర్తించి తమకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు.
Karepally : ‘వ్యవసాయానికి సబ్సిడీల తగ్గింపులో భాగమే యూరియా కొరత’
Kothagudem Urban : లంబాడీల ఆత్మగౌరవ సభను జయప్రదం చేయాలి : గుగులోతు రాజేశ్ నాయక్
ACB | లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఎల్లంపేట టౌన్‌ప్లానింగ్ అధికారి రాధాకృష్ణా రెడ్డి