బోనకల్లు, జులై 04 : ఫిజియోథెరపీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని బోనకల్లు ఎంఈఓ దామాల పుల్లయ్య అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని విద్యా వనరుల కేంద్రంలో ఫిజియోథెరపీ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఫిజియోథెరపిస్ట్ అమృత వర్షిణి మండలంలోని ప్రత్యేక అవసరాల పిల్లలకు ఫిజియోథెరపీ చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ.. మండలంలోని ప్రత్యేక అవసరాల పిల్లల కోసం ఈ ఫిజియోథెరపీ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో శిబిరం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐ ఈ డి టీచర్ రేగళ్ల రాణి, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.