Vaddiraju Ravichandra | టేకులపల్లి, డిసెంబర్ 14: తెలంగాణలో ప్రజలు బీఆర్ఎస్ వెంటే ఉన్నారని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. భవిష్యత్ బీఆర్ఎస్దే అని స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.
బీసీల ద్రోహి కాంగ్రెస్ అని, 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధనకు బీఆర్ఎస్ కట్టుబడి ఉందని తెలిపారు. ఖమ్మం జిల్లా టేకులపల్లి మండల కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ నేతలను బీఆర్ఎస్ చేరికల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భవిషత్తులో మంచి స్థానం ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్లో హామీ ఇచ్చారు. విలేకరుల సమావేశంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. కాంగ్రెస్ జరిగే అక్రమాలను, దౌర్జన్యాలను తట్టుకొలేక కాంగ్రెస్ ఉండలేక ఉమ్మడి ఖమ్మం జిల్లా డీసీసీబీ డైరెక్టర్, మాజీ జడ్పీటీసీ, బేతంపూడి పీఏసీఎస్ చైర్మన్ లక్కినేని సురేందర్ రావు, కాంగ్రెస్ సీనియర్ నేత భూక్య దల్ సింగ్ నాయక్ బీఆర్ఎస్ లో కేసీఆర్ నాయకత్వంలోని వచ్చారని తెలిపారు. టేకులపల్లి మండలంలో బీసీలకు ఒక్క వార్డు నెంబర్ కూడా కాంగ్రెస్ ఇవ్వలేదని, మళ్లీ పార్టీ తరఫున బీసీలకు ఇస్తామంటారు.. బీసీపై ప్రేమ ఉందని చెబుతుంటారని అన్నారు. పోలీసులు ఖాకీ డ్రెస్ వేసుకున్నట్లు లేరని, కాంగ్రెస్ డ్రెస్లో ఉన్నారని ధ్వజమెత్తారు.
ఇల్లెందు ఎమ్మెల్యే తమ్ముడు నామినేషన్ కేంద్రం వద్ద బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి అయ్యప్పమాలలో ఉన్నప్పటికీ కొడుతున్నప్పుడు అధికారులు ఏం చేస్తున్నారని వద్దిరాజు రవిచంద్ర ప్రశ్నించారు. తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు అంతంత మాత్రమేనని, కాంగ్రెస్ సర్కార్ బీసీలు ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. బీసీలందరూ టేకులపల్లి, ఇల్లెందులో జరిగే మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో అత్యధికంగా బీఆర్ఎస్ సర్పంచ్లను గెలిపించాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డికి పుట్ బాల్ ఆటగాడు మెస్సీపై ఉన్న ప్రేమ బీసీలపై లేదన్నారు. ఒక బీసీ బిడ్డగా నేను పార్లమెంట్లో ప్రైవేటు బీసీ బిల్లు ప్రవేశపెడతానని.. అన్ని పార్టీల మద్దతు నిలవాలన్నారు. టేకులపల్లి మండలంలోని దాసుతండా మూడు ఏకగ్రీవ వార్డు సభ్యులు, చుక్కలబోడు 8మంది వార్డు సభ్యులు, పలు పంచాయతీల నుంచి పంచాయతీ ఎన్నికల్లో అత్యధికంగా బీఆర్ఎస్ సర్పంచ్లను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఒక బీసీ బిడ్డగా నేను పార్లమెంట్లో ప్రైవేటు బీసీ బిల్లు ప్రవేశపెడతా అని.. అన్ని పార్టీల మద్దతు నిలవాలని కోరారు.
ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ మాట్లాడుతూ.. టేకులపల్లి మండలంలోని దాసుతండా మూడు ఏకగ్రీవ వార్డు సభ్యులు, చుక్కలబోడు 8 మంది వార్డు సభ్యులు, పలు పంచాయతీల నుంచి బీఆర్ఎస్లో చేరినట్లు తెలిపారు. బీఆర్ఎస్లో చేరిన ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులు డీసీసీబీ డైరెక్టర్, మాజీ జడ్పీటీసీ, బేతంపూడి పీఏసీఎస్ చైర్మన్ లక్కినేని సురేందర్ రావు, ఇల్లెందు కాంగ్రెస్ నేత భూక్యా దళ్ సింగ్ నాయక్, మాజీ దళాకమాండ్ పూనెం నర్సయ్య పలు పంచాయతీలోని కాంగ్రెస్ నేతలు చేరారు.