– సర్కార్ ఆదుకోవాలని వేడుకోలు
కరకగూడెం, మే 16 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం తాటిగూడెం గ్రామానికి చెందిన పోలెబోయిన వెంకటనారాయణ అనే రైతు గత ఏడాది 3 ఎకరాల్లో పామాయిల్ మొక్కలు వేసి సాగు చేస్తున్నాడు. కాగా గుర్తు తెలియని వ్యక్తులు పక్కన అగ్గి పెట్టడంతో మంటలు పామాయిల్ మొక్కలకు అంటుకుని మొక్కలు పూర్తిగా కాలిపోయాయి. పంట ఎదుగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు ఇలా జరగడంతో రూ.1 లక్ష మేర నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు, గ్రామస్తులు తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.