Paleru | ఖమ్మం రూరల్ : అధైర్య పడవద్దు అన్ని విధాల ఆదుకునేందుకు మీ వెంట మేమున్నామంటూ పలు కుటుంబాలకు పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి భరోసా కల్పించారు. ఆదివారం మున్సిపాలిటీ ఖమ్మం రూరల్ మండలంలోని పలు గ్రామాలలో ఆయన ఉదయం నుంచి సాయంత్రం వరకు విస్తృత పర్యటన చేశారు.
పార్టీ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, మాజీ జడ్పిటిసి ఎండపల్లి వరప్రసాద్, ఇతర పార్టీ నాయకులతో కలిసి బాధితుల కుటుంబాలకు వెళ్లి వారి ఆరోగ్య ఇతర పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆదిలాపురం మున్సిపాలిటీ పరిధిలోని నాయుడుపేట జలగం నగర్ పెద్దతండలో పర్యటించిన కందాల ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన టిడిపి పార్టీ మండల అధ్యక్షుడు సానబోయిన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అదేవిధంగా అనారోగ్యం బారిన పడి వైద్య చికిత్స తీసుకొని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పసుపులేటి రవికుమార్, షేక్ హుస్సేన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పెద్ద తండాలో బానోతు లక్ష్మణ్ ఇంటికి వెళ్లిన కందాల ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఖమ్మం రూరల్ మండలంలోని మంగళ గూడెం, కైకొండగూడెంలో పర్యటించిన కందాల అనారోగ్య బారిన పడి విశ్రాంతి తీసుకుంటున్న పలువురు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటికి వెళ్లి స్వయంగా వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి సమస్య వచ్చినా ఆదుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అధైర్యపడవద్దని బాధిత కుటుంబాలకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు బానోతు కృష్ణ, బానోత్ వీరన్న, బానోతు మోహన్, ముత్యం కృష్ణారావు, అక్కినపల్లి వెంకన్న, నాశ బోయిన కనకయ్య, వెంపటి ఉపేందర్, నాగయ్య, చీరాల వీరభద్రం, బండి సతీష్, ఏపూరి తరుణ్, నారపాటి రమేష్, పార్టీ సోషల్ మీడియా విభాగం బాధ్యులు మేకల ఉదయ్, వరుణ్ తదితరులు పాల్గొన్నారు.