నిజాంపేట, ఫిబ్రవరి 11: ప్రజాసంక్షేమమే లక్ష్యంగా 10 ఏండ్లు సుభిక్షమైన పాలన అందించిన మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా చల్మెడలో రేణుకా ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవాలను గౌడ సంఘం సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం నిర్వహించిన రేణుకా ఎల్లమ్మ కల్యాణ మహోత్సవానికి ఆమె హాజరై అమ్మవారిని దర్శించుకొన్నారు.
మాజీ సీఎం కేసీఆర్ పేరిట ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని వర్గాల అభివృద్ధికి మాజీ సీఎం కేసీఆర్ ఎనలేని కృషి చేశారని, మళ్లీ కేసీఆర్ సీఎం అయినప్పుడే రాష్ర్టానికి పూర్వవైభవం వస్తుం దన్నారు. ఆలయానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యేకు గౌడ సంఘం సభ్యులు శాలువాకప్పి సన్మానించారు.బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, రామాయంపేట మున్సిపాల్ మాజీ వైస్ చైర్పర్సన్ విజయలక్ష్మి,మాజీ ఎంపీపీ సంపత్, మాజీ ఎంపీటీసీలు బాల్‌రెడ్డి,నాళం కృష్టాగౌడ్, నాయకులు అబ్దుల్అజీజ్, గౌస్, నరేందర్, రంజిత్‌గౌడ్, వెంకటస్వామిగౌడ్, గౌడ సంఘం సభ్యులు ఎల్లాగౌడ్, లక్ష్మీనారాగౌడ్, తిర్మల్‌గౌడ్ పాల్గొన్నారు.