మధిర, ఫిబ్రవరి 8: ఆరు గ్యారెంటీలను అమలు చేసిన తర్వాతే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే నైతికహకు ఉంటుందని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ నాయకుడు నామా నాగేశ్వరరావు పేరొన్నారు. ఆదివారం మధిర పట్టణంలోని 1, 4, 8వ వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజుతో కలిసి ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నామా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మూడునెలల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని, ఆ కార్డులను జాగ్రత్తగా దాచుకోవాలని భట్టి విక్రమార ప్రజలకు చెప్పారు..
కానీ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయినా ఆ హామీల అమలు ఎకడా కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. ఆరు గ్యారెంటీలను అమలు చేశాకే ప్రజలను ఓట్లు అడగాలని భట్టికీ సవాల్ విసిరారు. ప్రజలను మోసం చేయడమే కాంగ్రెస్ లక్ష్యమని అన్నారు. మధిర నియోజకవర్గ ప్రజలు అందించిన విజయంతోనే భట్టి విక్రమార రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అయ్యారని నామా గుర్తు చేశారు.. కానీ అధికారంలోకి వచ్చాక ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొకారని మండిపడ్డారు.
మున్సిపాలిటీలో నిజమైన అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రచారంలో 1వ వార్డు అభ్యర్థి దోర్నాల ఎలిజిబెత్, 4వ వార్డు అభ్యర్థి మందడపు సుస్మిత, 8వ వార్డు అభ్యర్థి కొఠారి రాఘవరావును గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో చిత్తారు నాగేశ్వరావు, రంగిశెట్టి కోటేశ్వరరావు, మొండితోక జియాకర్, చావా వేణు, బీకీ కృష్ణప్రసాద్, రావూరి శ్రీనివాసరావు, పల్లబోతుల వెంకటేశ్వరావు, అరిగి శ్రీనివారావు, బొగ్గుల భాసర్రెడ్డి, కొఠారి రాఘవరావు, ఆళ్ల నాగబాబు, కోన నరేందర్ తదితరులు పాల్గొన్నారు.