
చింతకాని : తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామీణ పాఠశాలల్లో పండుగ వాతావరణం తీసుకురావాలని ఎంపీడీఓ బీ.రవికుమార్ అన్నారు. మండల పరిధిలో వందనం, కోదుమూరు, రాఘవాపురం, లచ్చగూడెం, ప్రోద్దుటూరు, నాగులవంచ తదితర గ్రామాల్లో సర్పంచులతో కలసి పాఠశాలల్లో జరుగుతున్న పారిశుధ్య కార్యక్రమాల తీరును పరిశీలించి పంచాయతీ సిబ్బందికి పలు సూచనలు చేశారు. తిమ్మినేనిపాలెం, తిర్లాపురం, సీతంపేట తదితర గ్రామాల్లోని పాఠశాలలను ఎంపీపీ కోపూరి పూర్ణయ్య సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆగష్టు చివరి నాటికి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో సరైన మౌళిక వసతులు కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. తరగతి గదుల్లో శానిటేషన్ పూర్తి చేయాలని కార్యదర్శులకు సూచించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీవో మల్లెల రవీంద్రప్రసాద్, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యదర్శులు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.