కారేపల్లి, జనవరి 22 : ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పరిధిలోని గాదెపాడులో గుండెపోటుతో మృతి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దాచేపల్లి కృష్ణారెడ్డి కుటుంబానికి బీఆర్ఎఫ్ పార్టీ ఎల్లప్పుడు అండగా నిలుస్తుందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. మృతుడు కృష్ణారెడ్డి స్వగ్రామమైన గాదెపాడుకు వారిద్దరు వేరువేరుగా చేరుకొని భౌతికకాయానికి పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు.
కార్యక్రమంలో ఖమ్మం నగర పార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజు, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, టిఆర్ఎస్ జిల్లా యూత్ విభాగం నాయకులు ముత్యాల వెంకట అప్పారావు,మాజీ జెడ్పిటిసి ఉన్నం వీరేందర్, మాజీ వైస్ ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు,బీఆర్ఎస్ తో పాటు వివిధ పార్టీలకు చెందిన నాయకులు,ధరావత్ మంగీలాల్,అడప పుల్లారావు, బానోత్ దేవుల నాయక్, హనుమకొండ రమేష్, కొండబోయిన నాగేశ్వరరావు, తాత వెంకన్న,బానోత్ రాందాస్,గడిపర్తి వీరన్న, నానబాల మల్లయ్య, సత్యనారాయణ,పంతులు నాయక్ ఉన్నారు.