ఖమ్మం రూరల్, డిసెంబర్ 09 : సీఐటీయూ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యుడిగా ఖమ్మం రూరల్ మండలం ఆరింపుల గ్రామానికి చెందిన పెరుమల్లపల్లి మోహన్ రావు నియమితులయ్యారు. మెదక్ పట్టణంలో ఈ నెల 7, 8, 9వ తేదీల్లో సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర మహాసభలు జరిగాయి. చివరి రోజు మంగళవారం జరిగిన మహా సభల్లో సీఐటీయూ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అందులో భాగంగానే ఖమ్మం జిల్లా సీఐటీయూ సహాయ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మోహన్ రావును రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యుడిగా సంఘం సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మోహన్ రావు మాట్లాడుతూ సంఘటిత, అసంఘటితరంగ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే తన ప్రధాన ధ్యేయమని తెలిపారు.