కారేపల్లి : మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ పాఠశాలలో రేపు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ ఎం.డీ.అక్తర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 6వతరగతికి ఉదయం 10గంటల నుంచి 1గంటల వరకు 7, 8, 9, 10 తరగతులలో ఖాళీగా ఉన్న సీట్లను భర్తి చేసేందుకు మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆన్లైన్ ధరఖాస్తులు చేసుకున్న వారు telanganams.cgg.gov.inవెబ్సైట్లో హాల్టికెట్స్ పొందాలని సూచించారు. కారేపల్లిలోని మోడల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపాల్ ఎం.డీ.అక్తర్ తెలిపారు.