ఖమ్మం, అక్టోబర్ 26 : బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ సిఫారసు మేరకు మంజూరైన రూ.19,16,500 విలువచేసే 56 సీఎంఆర్ఎఫ్(ముఖ్యమంత్రి సహాయ నిధి) చెకులను శనివారం లబ్ధిదారులకు అందజేశారు. ఖమ్మం నగరంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజుతో కలిసి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తాతా మధు మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎం సహాయ నిధి ద్వారా లబ్ధిదారులకు 60శాతం పైనే మంజూరు చేశారని గుర్తుచేశారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా సీఎం సహాయ నిధికి అర్జీ పెట్టుకోవాలనుకున్న ప్రతి పేదవాడికి బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో సహకారం అందుతుందని తెలిపారు. నిరుపేదలకు సీఎం సహాయ నిధి ద్వారా మేలు జరిగేందుకు తాతా మధు చేస్తున్న కృషిని బీఆర్ఎస్ నాయకులు అభినందించారు. కార్యక్రమంలో వైరా నియోజకవర్గ నాయకులు పోట్ల శ్రీను, డేరంగుల బ్రహ్మం, ముత్యాల వెంకట అప్పారావు, పోగుల శ్రీను, ఖమ్మంరూరల్ మండల పార్టీ అధ్యక్షుడు బెల్లం వేణు, నాయకులు ఇంటూరి శేఖర్, ఉద్యమకారులు పగడాల నరేందర్, లింగనబోయిన సతీష్, ముదిగొండ మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, సద్దాం షేక్, కార్యకర్తలు పాల్గొన్నారు.