ఖమ్మం, జూన్ 15 : ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌ను మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే టీ హరీశ్‌రావు శనివారం రాత్రి హైదరాబాద్‌లో పరామర్శించారు. తాతా మధు ఇటీవల అస్వస్థతకు గురై స్వల్ప శస్త్రచికిత్స చేసుకున్న విషయం తెలుసుకున్న హరీశ్‌రావు ఆయన్ని పరామర్శించారు. తాతా మధును పరామర్శించిన వారిలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మిర్యాలగూడెం మాజీ ఎమ్మెల్యే భాస్కర్‌రావు, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ తదితరులు ఉన్నారు.