మధిర/ బూర్గంపహాడ్, నవంబర్ 7: ఎవరు ఎన్ని కుట్రలు చేసినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్దే గెలుపని బీఆర్ఎస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలు ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని షేక్‌పేట తదితర కాలనీల్లో పార్టీ శ్రేణులతో కలిసి ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ తాతా మధు, జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు సహా పార్టీ నేతలు శుక్రవారం ఇంటింటికి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పదేళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని గుర్తుచేశారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో అంతా శూన్యమని విమర్శించారు. బీఆర్ఎస్ అభ్యర్థి సునీతను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ నాయకులు కొనకంచి శ్రీనివాసరావు, చల్లకోటి పూర్ణచందర్రావు తదితరులు పాల్గొన్నారు.