ఖమ్మం : ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల నుంచి ఎంఎల్సీ గా గెలుపొందిన తరువాత తాతా మధు సోమవారం ఖమ్మం నగరంలోని సీపీఐ కార్యాలయానికి వెళ్లి పార్టీ నాయకులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు. సీపీఐ జాతీయ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు కలిసి పుష్పగుచ్చం అందచేసి శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు భాగం హేమంతరావు, పోటు ప్రసాద్, జమ్ముల జితేందర్‌రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు చుంచు విజయ్, షేక్ రహీం తదితరులు పాల్గొన్నారు.