MLC Kalvakuntla Kavitha | ఖమ్మం : ప్రశ్నించిన వారిని ప్రభుత్వం టార్గెట్ చేస్తుందని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా ఆమె తొలుత జిల్లా సబ్ జైల్లో ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి సొసైటీ అధ్యక్షుడు లక్కినేని సురేందర్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు భూక్యరాజులను రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఇతర పార్టీ నాయకులతో కలిసి ములాఖత్ ద్వారా పరామర్శించారు.
ఖమ్మం రూరల్ బీఆర్ఎస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు బనాయించి రాక్షస ఆనందం పొందుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా ఖండించారు. అక్రమ కేసులు, అధికారం ఎప్పటికీ శాశ్వతంగా నిలవవు. ప్రజలకు సంక్షేమం అందించడంలో విఫలమవుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు బనామించడంలో ముందుంటుందని విమర్శించారు. అక్రమ కేసులో అరెస్ట్ అయిన లక్కినేని సురేందర్ మరియు ఇతర నాయకులకు బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీనిచ్చారు.
ఎమ్మెల్సీ కవిత వెంట ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాత మధుసూదన్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు బానోతు హరిప్రియ, మెచ్చ నాగేశ్వరరావు, మదన్ లాల్, మాజీ ZP చైర్మన్ లింగాల కమల్ రాజు, ఆర్జేసీ కృష్ణ, బొమ్మెర రామ్మూర్తి, బెల్లం ఉమా, రూరల్ బీఆర్ఎస్ పార్టీ బెల్లం వేణు, నిరోష తదితరులున్నారు.
Government Hospital | రికార్డ్ బ్రేక్.. 5 రోజుల్లో 200 సర్జరీలు