MLC Kalvakuntla Kavitha | ఖమ్మం : తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntla Kavitha) ఒక రోజు పర్యటనలో భాగంగా ఖమ్మం జిల్లాలో బిజీబిజీగా ఉన్నారు. తొలుత ఆమె జిల్లా సబ్ జైల్లో ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి సొసైటీ అధ్యక్షుడు లక్కినేని సురేందర్ , ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు భూక్యరాజులను రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఇతర పార్టీ నాయకులతో కలిసి ములాఖత్ ద్వారా పరామర్శించారు.
ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్సీ కవిత భరోసా కల్పించారు. అంతకుముందు ఎమ్మెల్సీ కవితకు జాగృతి సంస్థ బాధ్యులు ఖమ్మం రూరల్ మండలం టిఆర్ఎస్ పార్టీ నాయకులు పుష్పగుచ్చాలు అందించి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, అసరా పేట మాజీ ఎమ్మెల్యే మచ్చ నాగేశ్వరరావు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నేత ఆర్జేసీ కృష్ణ, బెల్లం ఉమా, ఎండపల్లి వరప్రసాద్, మరికంటి ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Government Hospital | రికార్డ్ బ్రేక్.. 5 రోజుల్లో 200 సర్జరీలు