చుంచుపల్లి, అక్టోబర్ 21 : నలభై ఏళ్లుగా నన్ను ఆదరిస్తున్నారు… మరోసారి ఆదరించండి… ఒక పాలేరులా మీరు మరిచిపోలేనంతగా కొత్తగూడెం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. మండలంలోని పెనగడప, అంబేద్కనగర్, రాం పు రం, వనమానగర్ పంచాయతీలో శనివారం ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న ప్రజలతో మాట్లాడారు. నా హయాంలోనే పెనగడప ప్రాంతంలో ఎంతో అభివృద్ధి చేశానని అన్నారు. ఒక పక్క ప్రజా సంక్షేమం, మరోపక్క అభివృద్ధి బాట ఈ రెండు నా కళ్లలాగా భావించానని, ప్రజల మధ్య నిత్యం ఉంటూ ప్ర జా సమస్యల కోసం శ్రమిస్తున్నానని అన్నారు. నాకు వెన్నంటి ఉండి, నియోజకవర్గ ప్రజలు అనేకసార్లు నన్ను అసెంబ్లీకి పంపారని, మరోసారి సీఎం కేసీఆర్ వద్ద పనిచేసే అవకాశాన్ని వచ్చే అసెంబ్లీ ఎన్నికల ద్వారా నాకు కల్పించాలని కోరారు.
ప్రచారంలో ప్రజల మనిషి వన మా… మేమందరం నీ వెంటే ఉంటామని ప్రజలు, అభిమానులు నినాదాలు చేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రావు, ఎంపీపీ బదావత్ శాంతి, సొసైటీ చైర్మన్ మండె వీరహన్మంతరావు, ఏఎంసీ చైర్మన్ రాంబాబు, ఆత్మకమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, రైతు బంధు సమితి కమిటీ చైర్మన్ కరుణాకర్, బీఆర్స్ జిల్లా అధికార ప్రతినిధి జేవీఎస్ చౌదరి, కాసుల వెంకట్, కొట్టి వెంకటేశ్వర్లు, సర్పంచ్‌లు ఇస్లావత్ జగదాంబ, మాలోత్ కళావతి, అచాచ నాగమణి, హమీద్, అనుదీప్, అచ్చ నరేందర్, బాసిరెడ్డి, సంతోష్, నాగరాజు, నిమ్మల సాగర్, అజీజ్‌ఖాన్, పాటి సుధాకర్, ఎనిగంటి శ్రీను, తగరం శ్రీను, దుర్గా, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.