సత్తుపల్లి, ఫిబ్రవరి 17 : తెలంగాణలో నిరుపేదల సొంతింటి కల నిజం చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఇల్లు లేని నిరుపేదలకు ప్రభుత్వమే అన్ని ఖర్చులతో డబుల్బెడ్రూం ఇండ్లు నిర్మించి లబ్ధిదారులకు అందజేస్తుందన్నారు. శుక్రవారం పట్టణ శివారులోని జేవీఆర్ ఎదురుగా రూ.5 కోట్లతో నిర్మించిన 96 డబుల్బెడ్రూం ఇండ్ల సముదాయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా లబ్ధిదారులకు డబుల్బెడ్రూం ఇండ్లు అందించడం ఆనందంగా ఉందన్నారు.
పేదల కోసం తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్బెడ్రూం ఇండ్లు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలతోపాటు ఇంటి తాళాలు, నూతన వస్ర్తాలు, నూతన వంట సామగ్రి అందజేశారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందుతున్నాయని, తెలంగాణకు యూనిట్‌గా తయారుచేసి లబ్ధిదారులకు డ్రా తీసి ఇండ్ల ను కేటాయించినట్లు చెప్పారు. దేశంలో ఆదర్శ గ్రామాలను కేంద్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ గుర్తిస్తే 20 ఆదర్శగ్రామాలను ప్రక్రటించగా.. అందులో 10 గ్రామాలు తెలంగాణకు చెందినవి ఉండడం ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్‌కు నిదర్శనమన్నారు.
ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు..
ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కేక్ కట్‌చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. డబుల్బెడ్రూం లబ్ధిదారులకు నూతన వస్ర్తాలు, వంటసామగ్రి పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో సూర్యనారాయణ, తహసీల్దార్ శ్రీనివాసరావు, కమిషనర్ సుజాత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, ఆత్మచైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, వైస్ చైర్పర్సన్ తోట సుజలారాణి, ఎంపీపీ హైమావతితోపాటు నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.