ఖమ్మం రూరల్, ఆగస్టు 16: ‘సీఎం కేసీఆర్ థ్యాంక్యూ’ నినాదాలతో బుధవారం ఖమ్మం రూరల్ మండల కేంద్రం హోరెత్తింది. దశాబ్దాలుగా వెనుకబడిన పాలేరు నియోజకవర్గానికి సీఎం వరాలు కురిపిస్తుండడం, జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల, నర్సింగ్, ఫిషరీస్ కళాశాలల మంజూరు చేయడంపై గురువారం పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందరెడ్డి ఆధ్వర్యంలో రూరల్ మండలకేంద్రమైన పెద్దతండాలో తిరుమలయపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి మండలాలకు చెందిన విద్యార్థులు మహార్యాలీ నిర్వహించారు.
‘సీఎం కేసీఆర్ సార్‌కు థ్యాంక్స్’ పేరుతో ఫ్లకార్డులు ప్రదర్శించారు. ఒకే ఏడాదిలో మూడు ప్రభుత్వ కళాశాలలు మంజూరు చేయడంపై పటాకులు కాల్చారు. బీఆర్ఎస్వీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు షేక్ బాజీబాబా, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, జడ్పీ వైస్ చైర్మన్ మరకింటి ధనలక్ష్మి, ఎపీపీలు బెల్లం ఉమ, బానోత్ శ్రీనివాస్, మంగిలాల్, జడ్పీటీసీ యండపల్లి వరప్రసాద్, వైస్ ఎంపీపీ దర్గయ్య, నేలకొండపల్లి ఏఎంసీ చైర్పర్సన్ నంబూరి శాంత, డీసీసీబీ సుడా డైరెక్టర్లు ఇంటూరి శేఖర్, గూడ సంజీవరెడ్డి, నాయకుడు చావా రామకృష్ణ, బోజెడ్ల దిలీప్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ పాలేరు నియోజకవర్గానికి జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల, నర్సింగ్, ఫిషరీస్ కళాశాల మంజూరు చేయడం ఆనందాన్నిచ్చింది. దశాబ్దాల కల అయిన మంగళగూడెం, కామంచికల్కు డబుల్ రోడ్డు మంజూరు చేయడం మరో ఆనందదాయకమైన అంశం. మరికొన్ని రోజుల్లో నాయుడుపేట నుంచి మండల శివారు వరకు ప్రధాన రహదారిలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తా. అనతి కాలంలోనే పాలేరు నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అగ్రస్థానంలో నిలిపా. నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చా. మున్ముందు మరిన్ని అభివృద్ధి పనులు చేపడతా. సీఎం కేసీఆర్ బాటలో నడుస్తూ ప్రజలకు సేవ చేస్తా. రూరల్ మండలానికి రైల్వేలైన్ రాకుండా శాయశక్తులా కృషి చేస్తా. రైతులెవరూ ఆందోళన చెందొద్దు.
– ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి