దుమ్ముగూడెం, జనవరి 4 : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలు అర్హులకు అందించే విధంగా అధికారులు కృషి చేయాలని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు. గురువారం నర్సాపురంలో జరిగిన గ్రామ సభలో ఆయన పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా తెల్లం మాట్లాడుతూ ప్రజలు సమర్పించే దరఖాస్తులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు.
అర్హులను ఎంపిక చేసి వారికి లబ్ధి చేకూర్చాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాంబాబు, ఆర్డీవో మంగీలాల్, ఎంపీపీ రేసు లక్ష్మి, జడ్పీటీసీ తెల్లం సీతమ్మ, మండల అధ్యక్షుడు అన్నెం సత్యాలు, ఉపాధ్యక్షుడు కామేశ్, ఎంపీటీసీ తిరుపతిరావు, తునికి సీత, తెల్లం రామకృష్ణ, దామెర్ల శ్రీనివాసరావు, బొల్లి శేఖర్, రాము తదితరులు పాల్గొన్నారు.