కారేపల్లి, ఫిబ్రవరి 10 : ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో గల తెలంగాణ మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలకు చెందిన విద్యార్థినులు రాష్ట్రస్థాయి యూత్ వాలీబాల్ క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 9న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బొజ్జాయిగూడెంలో ఈ ఎంపికలు జరగగా మైనార్టీ పాఠశాలకు చెందిన సోని, జాస్మిన్ రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనేందుకు అర్హత సాధించారు. పాఠశాల ప్రిన్సిపాల్ డి.సావిత్రి, పిడి జారే అనూష, పీఈటీ నాగేంద్రమ్మ విద్యార్థినులను అభినందించారు.