ఖమ్మం, ఆగస్టు 23: ఖమ్మం మెడికల్ కాలేజీ నూతన భవనాన్ని వచ్చే ఏడాదికి అందుబాటులోకి తేవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఇందుకోసం పనులను త్వరగా ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లోని సచివాలయంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను శుక్రవారం కలిసిన తుమ్మల..
పలు అంశాలతోపాటు ఖమ్మం వైద్య కళాశాల భవన నిర్మాణ పనుల పురోగతిపై చర్చించారు. వైద్య కళాశాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేటాయించిన స్థలంలో అధునాతన సౌకర్యాలతో భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కోరారు. అలాగే, ఖమ్మం ప్రధానాసుపత్రిలో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు, వైద్య పరికరాలు ఏర్పాటుచేయాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల రోగుల సంఖ్య అధికంగా పెరుగుతున్నందున అందుకు అనుగుణంగా వైద్యసిబ్బందిని పెంచాలని కోరారు.