ఖమ్మం, నవంబర్ 8: ఉమ్మడి ఖమ్మం జిల్లా యువతకు, భవిష్యత్ తరాలకు బాటలు వేసే బాధ్యత నాదే.. అని ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఎస్బీఐటీ ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ ఆర్జేసీ కృష్ణ అధ్వర్యంలో బుధవారం కళాశాలలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇంజినీరింగ్ విద్య అభ్యసించిన వారి కోసమే ప్రత్యేకంగా కేసీఅర్, కేటీఅర్ సహకారంతో ఐటీ హబ్ స్థాపించి నేడు వందల మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు. ఇకడ యువతకు ఐటీ రంగంలో ఉద్యోగాలు రావాలని, ఇకడ ఐటీ హబ్ నిర్మించి అందులో దాదాపు 20 కంపెనీలను ఒప్పించి, మెప్పించి తీసుకొచ్చి ఇకడ యువతకు ఉద్యోగాలు కల్పించామని గుర్తు చేశారు.
రాష్ట్రంలో 2014 సంవత్సరం నాటికి మన ఐటీ ఎగుమతులు 57 వేల కోట్లు కాగా నేడు.. 2.40 లక్షల కోట్ల స్థాయికి చేరుకున్నామని, ఇదంతా ఐటీ శాఖ మంత్రి కేసీఅర్ విజన్‌తోనే సాధ్యమైంది అని అన్నారు. ఐటీ రంగంలో నేడు మన రాష్ట్రం బెంగళూరును కూడా దాటి పోతున్నదంటే మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ఫలితమేనని అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా యువతకు హైదరాబాద్, బెంగళూరు స్థాయికి ఐటీ ఉద్యోగాలు ఇకడ పొందాలని నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన నాడే సంకల్పించానని పేరొన్నారు. మీకు, మీ తరువాత తరానికి మంచి ఖమ్మం ఇవ్వాలనే మంచి ఆలోచనతో, తపనతో శక్తి యుక్తి ఉన్న వాడిని మీరు ఎన్నుకోవాలని కోరారు. మనకు, మన భవిష్యత్ తరాలకు మంచి పాలన, మంచి ఖమ్మం అందుకోవాలంటే రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్, విద్యార్థులు పాల్గొన్నారు.