ఖమ్మం : ఉమ్మడి నిజామాబాద్ స్థానిక సంస్థల ఎంఎల్సీ గా టిఆర్ఎస్ అభ్యర్ధి కల్వకుంట్ల కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ బుధవారం హైద్రాబాద్‌లో కవితను కలిసి పుష్పగుచ్చం అందచేసి శుభాకాంక్షలు తెలిపారు. ఒక గొప్ప వక్త, అన్ని రంగాలలో మంచి విషయ పరిజ్ఞానం, ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న నాయకురాలు కవిత అని మంత్రి కొనియాడారు.
స్థానిక సంస్థల నుంచి శాసనమండలి కి కవిత ఎన్నిక కావడంతో స్థానిక సంస్థల సభ్యులకు, ప్రజా ప్రతినిధులకు భరోసా కలిగిందన్నారు. అలాగే నిజామాబాద్ జిల్లాకు ఎంతో మేలు జరుగుతుందని మంత్రి పువ్వాడ అభిప్రాయపడ్డారు.